తిరుమల ఆలయం పోటులో అగ్నిప్రమాదం - fire accident in tirupati updates
fire accident in tirupati
12:28 April 01
ప్రసాదాల తయారీ సమయంలో అంటుకున్న నెయ్యి మరకలు
తిరుమల శ్రీవారి ఆలయంలోని వకుళామాత పోటులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గోనె సంచులకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నెయ్యి అంటుకున్న గోనెసంచులు కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన తితిదే సిబ్బంది మంటలు ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Last Updated : Apr 1, 2021, 1:16 PM IST