Film Producer NVPrasad on MLA Comments: సినిమా పరిశ్రమను కించపరిచేలా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్రెడ్డి మాట్లాడటం సరికాదని ప్రముఖ సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ హితవు పలికారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సినిమా వాళ్ల పట్ల అమర్యాదగా మాట్లాడటం సరికాదని ప్రసాద్ సూచించారు. ప్రసన్న కుమార్ వెంటనే తన వ్యాఖ్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Film Producer NVPrasad on MLA Comments: ప్రసన్న కుమార్.. వ్యాఖ్యలు వెనక్కి తీసుకో -నిర్మాత ఎన్వీ ప్రసాద్ - Film Producer NVPrasad on MLA Comments
Film Producer NVPrasad on MLA Comments: సినిమా పరిశ్రమను కించపరిచేలా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడటం సరికాదని ప్రముఖ సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ హితవు పలికారు. ఎమ్మెల్యే వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నిర్మాత డిమాండ్ చేశారు.
" సినిమా పరిశ్రమను కించపరిచేలా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడటం సరికాదు. అది పూర్తిగా అప్రజాస్వామికం. సినిమా పరిశ్రమను అవమానించేలా మాట్లాడటం తగదు. ఎంతో మంది కష్టపడి పనిచేస్తేనే పరిశ్రమ నిలబడుతుంది. రోప్ కట్టుకుని వందల అడుగులు దూకితే కష్టం తెలుస్తుంది. మీడియా ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే హీరోలు కారు. ప్రసన్నకుమార్ మాట్లాడిన మాటలు ఆయనకు వర్తిస్తాయేమో చూసుకోండి. ప్రసన్న కుమార్ వ్యాఖ్యలను విరమించుకోవాలని కోరుతున్నాం. " -ఎన్వీ ప్రసాద్, సినీ నిర్మాత
ఇదీ చదవండి : 'మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు.. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్