ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి నుంచి అలిపిరిలో ఫాస్టాగ్‌ అమలు! - అలిపిరి టోల్ గేట్ తాజా వార్తలు

తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో రేపటి నుంచి ఫాస్టాగ్‌ అమలు చేయనున్నారు. ఫాస్టాగ్‌ అమలుతో పాటు పెంచిన టోల్‌ ధరలను కూడా అమలు చేయాలని తితిదే భావిస్తోంది.

fast tag implementation in alipiri
fast tag implementation in alipiri

By

Published : May 31, 2021, 10:52 AM IST

జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల తరహాలో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో జూన్‌ 1నుంచి ఫాస్టాగ్‌ అమలు చేయనున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ప్రతి వాహనానికి సంబంధించి ఫాస్టాగ్‌ ద్వారా రుసుము చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఓ ప్రముఖ సంస్థ తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలోని ఓ బ్యాంకుతో రుసుము వసూలు సాఫ్ట్‌వేర్‌ అనుసంధానం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసి పరిశీలన పూర్తి చేశారు.

సోమవారం మరోసారి పరిశీలన జరిపి మంగళవారం నుంచి అమలు చేయనున్నారు. గతంలో తితిదే ధర్మకర్తల మండలి అలిపిరి టోల్‌ ధరలను పెంచాలని నిర్ణయించి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వం అందుకు అంగీకారం తెలిపింది. ఫాస్టాగ్‌ అమలుతో పాటు పెంచిన టోల్‌ ధరలను కూడా అమలు చేయాలని తితిదే ప్రయత్నం చేస్తోంది. సోమవారం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన తితిదే నుంచి రానున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details