ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్​ను గెలిపించండి' - కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల ప్రచారం

తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్​ను గెలిపించాలని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం కోరారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడం కాంగ్రెస్ బాధ్యతని అన్నారు.

jd seelam comets on fire and bjp
తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్​

By

Published : Apr 12, 2021, 10:10 PM IST

విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడం కాంగ్రెస్ బాధ్యతని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్​కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ మేరకు తిరుపతిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేవుడి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోని పార్టీ... పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అత్యధిక మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న సీఎం జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు. పార్లమెంటులో మాట్లాడాల్సిన వైకాపా ఎంపీలు బయట గాంధీ విగ్రహం వద్ద నిలబడితే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details