తిరుపతి ఖాదీకాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడు అమరేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు గురైన ఆ విద్యార్థి ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై అలిపిరి పోలీసు స్టేషన్లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడి లైంగిక దాడి - sexual harrasement news in tirupathi
సంస్కారం నేర్పించాల్సిన గురువే విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడి లైంగిక దాడి