ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్​, భాజపా మధ్య పోటీ: చింతామోహన్

తిరుపతి ఉప ఎన్నిక.. కాంగ్రెస్​, భాజపా మధ్య జరిగే యుద్ధమన్నారు మాజీ ఎంపీ చింతామోహన్. ఇరు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేశారు. దొంగ ఓట్లతో వైకాపా ఎన్నికల్లో గెలుస్తోందని ఆరోపించారు. 20 మందికిపైగా ఉన్న ఆ పార్టీ ఎంపీలు.. ఏం సాధించారని ప్రశ్నించారు.

ex mp chinta mohan
ex mp chinta mohan

By

Published : Mar 20, 2021, 3:47 PM IST

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నిక దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. శ్రీకాళహస్తిలో మాట్లాడిన ఆయన.. తిరుపతి ఉప ఎన్నిక భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగే యుద్ధమని చెప్పారు. తిరుపతిని రాజధానిగా చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 లోక్​భ స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో వైకాపా ఎన్నికల్లో గెలుస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో 20 మందికిపైగా ఎంపీ స్థానాలు గెలిచిన వైకాపా.. కేంద్రంలో సాధించింది ఏమీ లేదన్నారు. సీఎం జగన్ మంచి న్యాయవాదిని ఏర్పాటు చేసుకుని తనపై ఉన్న కేసులను కొట్టివేసుకోవాలని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details