కొవిడ్ కేసులను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీకాలు, ఆక్సిజన్ వంటి వాటిని విదేశాలకు అమ్ముకుని ప్రధాని మోదీ, అమిత్ షా దేశ ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్ 40-50 వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: చింతామోహన్ - కేంద్రపై చింతామోహన్ ఫైర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను నియంత్రించటంలో ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొవిడ్ రోగులను ఆదుకోవటంలో విఫలమైందన్నారు. తిరుపతిలో పరీక్షలు, వ్యాక్సిన్ల ప్రక్రియ శూన్యమన్న చింతామోహన్.. స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారన్నారు. బెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు పెట్టి కేరళ, తమిళనాడులో ఒక దశలో ఎన్నికలు ముగించటంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2019 నుంచి భాజపా విజయాలను ఎలక్ట్రోరల్ ఫ్రాడ్స్ గా అభివర్ణించారు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్ కోతలు