ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుపతి ఉప ఎన్నిక దేశ భవిష్యత్తుకు మలుపు' - తిరుపతి ఉపఎన్నికపై చింతా మోహన్ కామెంట్స్

తిరుపతి ఉపఎన్నిక దేశ భవిష్యత్తుకు మలుపులాంటిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక దేశ భవిష్యత్తుకు మలుపు
తిరుపతి ఉప ఎన్నిక దేశ భవిష్యత్తుకు మలుపు

By

Published : Mar 19, 2021, 5:42 PM IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆరోపించారు. ఎన్నికలు అంతా బోగస్ అని విమర్శించారు. ఓట్ల లెక్కింపు సమయంలో మీడియాను ఎందుకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. భాజపా, వైకాపాల మధ్య ఎలాంటి తేడా లేదని ఎద్దేవా చేశారు. జీవితా బీమా సంస్థ ప్రవేటీకరణకు పార్లమెంట్​లో మద్దతివ్వటం ద్వారా వైకాపా వైఖరి బయటపడిందన్నారు. తిరుపతి ఉపఎన్నిక దేశ భవిష్యత్తుకు మలుపులాంటిదని వ్యాఖ్యనించారు.

ABOUT THE AUTHOR

...view details