సాధించాల్సింది చాలా ఉంది... కానీ చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. ఒత్తిడికి లోనై జీవించేందుకు ధైర్యం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బతికేందుకు ఎన్నో మార్గాలున్నా కుంగుబాటుకు తలొగ్గి... ప్రాణాలొదిలేస్తున్నారు. ఎంత సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడాలే తప్ప... చావే సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా అదే తప్పు పునరావృతం అవుతూనే ఉంది.
" ధనాన్ని కోల్పోయిన వాడు కొంత కోల్పోతాడు.
స్నేహాన్ని కోల్పోయినవాడు ఎంతో కోల్పోతాడు!!
అదే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోతాడు"- స్పానిష్ సూక్తి