తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తత్త్వాన్ని లోకానికి చాటిన అన్నమయ్య కీర్తనలలోని ఆధ్యాత్మిక తత్త్వం, గొప్పతనం యువతకు చేరువ కావాలని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. అన్నమయ్య భవనంలో అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్ సెలక్షన్ కమిటీతో సమావేశం నిర్వహించారు. అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించగా అందులో 14 వేల కీర్తనలను స్వరపరిచేందుకు గుర్తించినట్లు పేర్కొన్నారు. అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్ సెలక్షన్ కమిటీ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపికైన కళాకారులతో వెయ్యి కీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా రికార్డు చేస్తామని చెప్పారు. ఎస్వీబీసీలో ప్రతిరోజు 30 నిమిషాలు అన్నమాచార్య, పురందరదాసు, తరి గొండ వెంగమాంబ సంకీర్తన కార్యక్ర మాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
'అన్నమయ్య కీర్తనల గొప్పదనం యువతకు చేరువవ్వాలి'
అన్నమయ్య కీర్తనల గొప్పదనం యువతకు చేరువవ్వాలని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. అన్నమయ్య సంకీర్తనల రికార్డింక్ సెలక్షన్ కమిటీతో అన్నమయ్య భవనంలో సమావేశం నిర్వహించారు.
eo dharmareddy on annamayya sankeerthanalu