తిరుపతి రుయా కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ప్రమాద కారణాలను అన్వేషించడంపై విజిలెన్స్ బృందాలు దృష్టి పెట్టాయి. నావికాదళం డాక్ యార్డ్ బృందం కూడా ఆస్పత్రిలోని ఆక్సిజన్ ట్యాంకును పరిశీలించి ఘటనపై ఆరా తీసింది. అధికారులకు చెబుతున్న దానికి భిన్నంగా ఘటన జరిగిన సమయంలో పరిస్థితులు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోలుకొనే స్థితిలో ఉన్న తమవారు...సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మృత్యువాత పడిన రోగుల కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు మృతదేహాలను అప్పగించారు. రుయా ఆస్పత్రిలో 19 కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంకులు ఉండగా... రోజుకు 15 కేఎల్ అవసరం అవుతుంది.
కారణాలపై ఆరా..
ప్రాణ వాయువు సరఫరా కోసం తమిళనాడులోని శ్రీపెరంబదూరుకు చెందిన లిండే సంస్థతో మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్యాంకుల్లో ఆక్సిజన్ స్థాయి 50 శాతం తగ్గిన వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం నేరుగా వారికి చేరిపోతుంది. అందుకు అనుగుణంగా ఆక్సిజన్ ట్యాంకర్ బయల్దేరి వస్తుంది. శ్రీపెరంబదూరు నుంచి తిరుపతి దాదాపు 130 కిలోమీటర్ల దూరం కాగా...నిబంధనల మేరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడున్నర గంటల్లోనే ఆక్సిజన్ ట్యాంక్ చేరుకోగలదు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకే ట్యాంకర్ చేరుకోవాల్సి ఉన్నా...అలా ఎందుకు జరగలేదో అధికారులు కారణాలను అన్వేషిస్తున్నారు. తమిళనాట ఆంక్షలూ ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
కనిపిస్తోన్న నిర్లక్ష్య ధోరణి