ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పేరుతో తిరుపతి టీపీపీఎం ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషాతో కలిసి ప్రారంభించారు. ఆంగ్ల భాషలో నైపుణ్యం లేకపోవటం వల్ల పేదపిల్లలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని కరుణాకర్ రెడ్డి అన్నారు. 23 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణా తరగతులను సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా.. ఉపాధ్యాయులు ఆంగ్ల భాషలో పట్టుసాధించటంతో పాటు....భాషా పరంగా వారికీ మెరుగయ్యే అవకాశం కలుగుతుందన్నారు.
'ఆంగ్లం పై పట్టు సాధించండి... విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దండి' - తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆంగ్లంపై పట్టు సాధించటం ద్వారా...విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్లం పై పట్టు సాధించటం కోసం... ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పేరిట తిరుపతి టీపీపీఎం ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.
మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి, హాజరైన ఉపాధ్యాయులు