ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదేలో అర్చకుల కొనసాగింపుపై దేవాదాయ శాఖ నోటిఫికేషన్‌ - AP Endowment department News

తితిదేలో అర్చకుల కొనసాగింపుపై దేవాదాయ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. వంశపారంపర్యంగా కొనసాగే అర్చకులకు రెండు విధానాలు అమలు జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. కుమారుడిని అర్చకత్వం కోసం నామినేట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 2 విధానాల్లో ఒకటే ఎంపిక చేసుకునే అవకాశాన్ని అర్చకులకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తితిదేలో అర్చకుల కొనసాగింపు
తితిదేలో అర్చకుల కొనసాగింపు

By

Published : Apr 10, 2021, 12:34 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్యంగా అర్చకుల కొనసాగింపునకు రెండు వేర్వేరు విధానాలను అనుసరించేలా... దేవాదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. నిర్ణీత వేతనం పొంది విధులు నిర్వహిస్తూ 65 సంవత్సరాలకు పదవీ విరమణ చేసి, తన కుమారుడిని అర్చకత్వం కోసం నామినేట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.

తితిదే నిర్ణయించిన సంభావనతో ఆరోగ్యంగా ఉన్నంత కాలం శ్రీవారికి కైంకర్యం చేసి అనంతరం తన కుమారుడిని అర్చకత్వం కోసం నామినేట్ చేసుకునే వెసులుబాటునూ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రెండు విధానాలలో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశాన్ని అర్చకులకు కల్పిస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణి మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. వేతనంపై పనిచేస్తున్న అర్చకులు ఏ సమయంలోనైనా సంభావన పొందుతూ అర్చకత్వం చేసే విధానానికి మారవచ్చని ప్రభుత్వం పేర్కొంది. సంభావన తీసుకునే అర్చకులు వేతన విధానానికి మార్చుకునే వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details