తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అత్యవసర సమావేశం శనివారం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లను తితిదే చేస్తోంది. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల అన్నమయ్య భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో శ్రీవారి దర్శన విధివిధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
శనివారం తితిదే పాలకమండలి అత్యవసర సమావేశం - ttd emergency board meeting latest news
శ్రీవారి దర్శనాలు, విధి విధానాలపై తితిదే పాలకమండలి శనివారం అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు అన్నమయ్య భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్మన్, ఈవో, అదనపు ఈవో నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.
![శనివారం తితిదే పాలకమండలి అత్యవసర సమావేశం emergency ttd board meeting in tirumala annamayya bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7870222-92-7870222-1593743668271.jpg)
శ్రీవారి దర్శనాలు తదితర అంశాలపై తితిదే పాలకమండలి సమావేశం
TAGGED:
తితిదే తాజా వార్తలు