Covid cases in Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం వద్ద గల పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం రేపింది. కళాశాలలో శిక్షణ పొందుతున్న వారిలో 11 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ కొందరిని ఇంటికి పంపి మరికొందరిని అక్కడే ప్రత్యేక గదిలో ఉంచామని తెలిపారు. ఐదుగురికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. కళాశాలలో 105 మంది తితిదే సెక్యూరిటీ సిబ్బంది శిక్షణ పొందుతున్నారు. అధికారులు... ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు.
Covid cases in Tirupati: తిరుపతి పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం - తిరుపతి జిల్లా తాజా వార్తలు
Covid cases in Tirupati: తిరుపతి పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. 11 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
కరోనా కలకలం
Last Updated : Sep 7, 2022, 5:56 PM IST