ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల ఘాట్​ రోడ్డులో చక్కర్లు కొట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులు

తిరుమల ఘాట్​ రోడ్డులో వాయు కాలుష్యాన్ని తగ్గించేలా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు పరిశీలిస్తున్నామని ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు...మూడు రోజుల పాటు ఎలక్ట్రిక్ బస్సులు ప్రయోగాత్మకంగా నడిపి, వాటి సామర్థ్యాన్ని పరిశీలిస్తామన్నారు.

Electric buses
Electric buses

By

Published : Nov 6, 2020, 3:23 PM IST

తిరుమల ఘాట్ రోడ్డులో వాయికాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్డు సర్వీస్ అందించే రెండు సప్తగిరి ఎక్స్​ప్రెస్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా తీర్చిదిద్దామన్న ఆర్​ఎమ్​....మూడు రోజుల పాటు ఘాట్​పై వాటి పనితీరు, సామర్ధ్యాన్ని పరిశీలిస్తామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించటం ద్వారా ఘాట్​ రోడ్డులో వాయుకాలుష్యాన్ని తగ్గించాలనే ప్రణాళికలకు అనుగుణంగా కృషి చేస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details