ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TIRUMALA: తిరుమల, తిరుపతికి విద్యుత్‌ బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్‌, తిరుపతి అర్బన్‌ పరిధిలో 100 విద్యుత్‌ బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం ఆదేశాలు అందాయి. తిరుమల ఘాట్‌, తిరుపతిలో 100 బస్సులతోపాటు, విశాఖలో 100, విజయవాడ, గుంటూరు, కాకినాడలకు 50 చొప్పున మొత్తం 350 బస్సులకు అయిదు లాట్లుగా టెండర్లు పిలిచారు.

Electric buses
Electric buses

By

Published : Jul 8, 2021, 9:09 AM IST

ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్‌, తిరుపతి అర్బన్‌ పరిధిలో 100 విద్యుత్‌ బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం ఆదేశాలు అందాయి. తిరుమల ఘాట్‌, తిరుపతిలో 100 బస్సులతోపాటు, విశాఖలో 100, విజయవాడ, గుంటూరు, కాకినాడలకు 50 చొప్పున మొత్తం 350 బస్సులకు అయిదు లాట్లుగా టెండర్లు పిలిచారు. ఇందులో తిరుమల ఘాట్‌, తిరుపతి అర్బన్‌లో బస్సులకు ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఒలెక్ట్రా) ఎల్‌-1గా నిలిచింది. ఈ సంస్థ ప్రస్తుత ఆర్టీసీ డీజిల్‌ ఏసీ బస్సులకు ప్రతి కిలోమీటరుకు అయ్యే ఖర్చుకే.. విద్యుత్‌ బస్సులను నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

విద్యుత్‌ ఛార్జితో కలిపి కి.మీ.కి తిరుమల ఘాట్‌లో రూ.52.52, తిరుపతి అర్బన్‌ పరిధిలో రూ.44.95 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో ఫేమ్‌-2 పథకం కింద వీటికి సాయం అందించాలంటూ ఆర్టీసీ అధికారులు.. కేంద్రానికి బుధవారం సమాచారం పంపారు. నాలుగు నెలల తర్వాత ఈ బస్సులు రోడ్డెక్కుతాయని, ఏడాదిలోగా 100 బస్సులు వస్తాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం, గుంటూరులోని బస్సుల టెండరులో ఈవీ ట్రాన్స్‌ (ఒలెక్ట్రా), విజయవాడ, కాకినాడల్లో బస్సులకు అశోక్‌ లేలాండ్‌ ఎల్‌-1గా నిలిచాయి. ఆర్టీసీ ఏసీ డీజిల్‌ బస్సులకు ప్రతి కి.మీ.కు అయ్యే వ్యయం కంటే అదనంగా విజయవాడలో కి.మీ.కు రూ.10, గుంటూరులో రూ.8, కాకినాడ, విశాఖలో రూ.6 వరకు పెంచి ఈ సంస్థలు టెండరు వేశాయి. దీంతో ప్రభుత్వం వీటికి ఆమోదం తెలపలేదు. ఈ టెండర్లు రద్దయినట్లేనని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం దిశగా కేంద్రం మరో అడుగు.. కన్సల్టెంట్‌ నియామకానికి నోటిఫికేషన్‌

ABOUT THE AUTHOR

...view details