ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పూర్తి స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలి: సీఈసీ

రానున్న ఎన్నికలు పూర్తి స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్​అరోరా ఆదేశించారు. దిల్లీ నుంచి ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సీఈవోలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ నుంచి సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్, సీఈవో విజ‌యానంద్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

సీఈసీ రివ్యూ
సీఈసీ రివ్యూ

By

Published : Apr 2, 2021, 8:43 PM IST

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ సునీల్​అరోరా ఆదేశించారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, సీఈవోల‌తో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజ‌యానంద్ వీడియో కాన్ఫ‌రెన్స్​కు హాజరయ్యారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో... అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు సీఎస్ వివ‌రించారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్టాలతో చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయని... ఆయా జిల్లాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు, ఫ్లైయింగ్ స్క్వాడ్​లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. మొత్తం 65 అంతర్రాష్ట్ర చెక్​పోస్టులను ఏర్పాటు చేశామని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సీఈసీకి వివరించారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన తర్వాత 30మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు సీఈసీకి వివ‌రించారు. ఉపఎన్నిక నిర్వహణకు కేంద్రం నుంచి 10 కంపెనీల సీఐఎస్ఎఫ్ బ‌ల‌గాల‌ను పంపాల‌ని... రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి విజయానంద్ కోరారు. ఎన్నిక‌లకు అవ‌స‌ర‌మైన పోలింగ్ సిబ్బంది, తిరుప‌తి ఉప‌ఎన్నిక‌ భ‌ద్ర‌త‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను, ఇత‌ర ఏర్పాట్లు పూర్తి చేస్తున్న‌ట్లు సీఈసీకి వివరించారు.

ఇదీ చదవండీ... మా నాన్నది రాజకీయ హత్యే: సునీతారెడ్డి

ABOUT THE AUTHOR

...view details