ఇదీ చదవండి :
వామ్మో.. దుకాణంలో చేరిన 8 అడుగుల పాము - snake in tirumala shops
తిరుమలలోని ఓ దుకాణంలో ఎనిమిది అడుగుల పాము చేరింది. సీఆర్వో వద్ద గల మిని షాపింగ్ సెంటర్లోని ఓ దుకాణంలో ఎలుకల కోసం నక్కింది. దుకాణదారుడు వస్తువుల కోసం వెతుకుతూ సర్పాన్ని గమనించాడు. వెంటనే సమాచారాన్ని పాములు పట్టుకునే భాస్కర్ నాయుడుకు అందించారు. ఆయన దుకాణంలో ఉన్న పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పామును తీసుకెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
snake in tirumala