ఆన్‌లైన్ తరగతులకు సాంకేతిక అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... వందశాతం విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులకు వీలుగా సాంకేతిక అభివృద్ధి చేస్తున్నామన్నారు.
'ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. పరిశోధనలకు పెద్దపీట వేయాలని సమావేశంలో తీర్మానం చేశాం. 8వ తరగతి నుంచి కంప్యూటర్ కోడింగ్‌పై తరగతుల నిర్వహణ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం'- ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి