చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో సులభతర వాణిజ్యంపై సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డి, ఏఐసీసీ ఛైర్‌పర్సన్ రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ... చిత్తూరును పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటుందని రోజా చెప్పారు. 18 శాతంగా ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను రెట్టింపు చేసేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ పూర్తి సహకారం అందిస్తుందని రోజా వివరించారు.
'పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా చిత్తూరు'
చిత్తూరును పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డి, ఏఐసీసీ ఛైర్‌పర్సన్ రోజా పేర్కొన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయంలో సులభతర వాణిజ్యంపై జరిగిన సమావేశంలో వీరు పాల్గొన్నారు.
సులభతర వాణిజ్యంపై సమావేశం