ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: వెనకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించిన తితిదే - కడప జిల్లా వార్తలు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే వెనకబడిన వర్గాల భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించింది. ఈ కార్యక్రమానికి సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారం అందించింది.

TTD
TTD

By

Published : Oct 7, 2021, 9:23 PM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు (ttd provided darshan to the devotees of the backward classes today) తితిదే ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన నేడు.. చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన భక్తులకు దర్శనం కల్పించింది. రోజుకు వెయ్యి మంది చొప్పున.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వెనకబడిన వర్గాల వారికి ఉచితంగా రవాణా, భోజనం, వసతి ఏర్పాట్లతో దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారం తితిదే తీసుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details