ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశ్వానికీ ప్రభుత్వం ఉందట... దేవదేవతలకు శాఖలు ఉన్నాయట! - తిరుమలలో డ్రైవర్ వైరల్ వీడియో

ప్రజా పాలనకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. శాఖలవారీగా మంత్రులూ ఉన్నారు. ఇదేరీతిలో విశ్వమంతటికీ కూడా ప్రభుత్వం ఉందట. మంత్రులూ ఉన్నారట! ఆశ్చర్యంగా ఉంది కదూ!

driver intresting comments on gods
దేవుళ్లపై డ్రైవర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : Dec 30, 2019, 6:40 PM IST


తిరుమలకు నిత్యం వేలాదిమంది యాత్రికులు వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన కొంతమంది యువకులు శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ట్యాక్సీలో కొండపై నుంచి కిందకు దిగుతుండగా యువకులతో డ్రైవర్ మాటలు కలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మాదిరిగా... విశ్వమంతటికీ ప్రభుత్వం ఉందని... మంత్రులూ ఉన్నారని వారికి చెప్పారు. శాఖలవారీగా దేవదేవతల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరిచారు. డ్రైవర్ ఆసక్తికర మాటలను మొబైల్​లో రికార్డు చేసిన యువకులు... సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.

దేవుళ్లపై డ్రైవర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details