తితిదే నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల సరఫరా కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని దాత పొలినేని అంకమ్మ చౌదరి.. వారి కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో 10 టన్నుల ఉచిత కూరగాయలను పంపినట్లు తెలిపారు. ఒక లారీలో ఈ సరుకులను చేరవేశారు. వాహనానికి పూజలు నిర్వహించి.. జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదానానికి కూరగాయలు పంపిణీ చేస్తున్నామని... ఈ సారి తాము కూడా భాగస్వాములు కావటం సంతోషంగా ఉందని దాత అంకమ్మ చౌదరి తెలిపారు.
తితిదే నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయల పంపిణీ - ttd Nithya Annadanam latest news
తితిదే నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయల సరఫరా కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని పొలినేని అంకమ్మ చౌదరి, వారి కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో నిత్యావసరాలు పంపినట్లు తెలిపారు.
తితిదే నిత్య అన్నదానానికి కూరగాయలు అందజేత