ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు చర్యలు చేపట్టండి'

ఎర్రచందనం స్మగ్లింగ్​ అరికట్టేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని... ప్రత్యేక కార్యదళం ఇన్​ఛార్జి డీఐజీ కాంతిరాణా టాటా సూచించారు. స్మగ్లర్ల ఫోను కాల్స్ సమాచారంపై దృష్టి పెట్టాలన్నారు. స్మగ్లర్లకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని ఆదేశించారు.

Dig kantirana tata
Dig kantirana tata

By

Published : Oct 19, 2020, 10:50 PM IST

ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం ఇన్​ఛార్జి డీఐజీ కాంతిరాణా టాటా... అధికారులకు సూచించారు. తిరుపతిలోని ఎర్ర చందనం ప్రత్యేక దళం కార్యాలయంలో ఆయన నాలుగు జిల్లాల ఎస్పీలు, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఎర్రచందనం పరిరక్షణపై చిత్తూరు, నెల్లూరు, కడప, తిరుపతి అర్బన్... జిల్లా, టాస్క్ ఫోర్స్ ఎస్పీలతో సమావేశమైన డీఐజీ... స్మగ్లర్ల ఫోనుకాల్స్ సమాచారంపై దృష్టి పెట్టాలని, ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. స్మగ్లర్​లకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసేందుకు వీలుగా ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details