తిరుపతిలో జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్‌లో.. డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఆమె తండ్రి సీఐ శ్యామ్‌సుందర్‌ను అధికారులు సత్కరించారు. డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కుమార్తె జెస్సీకి.. తండ్రి శ్యామ్‌సుందర్ సెల్యూట్ చేసిన ఘటన గురించి తెలుసుకున్న డీజీపీ.. వారిద్దరితో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం డ్యూటీమీట్ వేదికపై సత్కరించారు.
మహిళా అధికారులు ప్రజల కష్టాలను సావధానంగా ఆలకిస్తారని.. బాధను అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపుతారని శ్యామ్‌సుందర్ అభిప్రాయపడ్డారు.