తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని.. పోలీసులు నిష్పక్షపాతంగా పని చేశారని అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణాటాటా తెలిపారు. ద్విచక్ర వాహన ర్యాలీతో అవాంతరాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందునే.. అనుమతించలేదని వెల్లడించారు. తిరుపతి దామినేడు కూడలి వద్దకు చంద్రబాబు కాన్వాయ్ రాగానే కొందరు యువకులు.. ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయటంతో, నిలువరించాల్సి వచ్చిందన్నారు. అప్పుడు తోపులాట మాత్రమే జరిగిందని డీఐజీ తెలిపారు. కార్యకర్త గాయపడిన సంఘటనపై విచారణ చేస్తున్నట్లు వివరించారు.
తెదేపా కార్యకర్తను పోలీసులు గాయపరచలేదు: డీఐజీ - తెదేపా కార్యకర్తను గాయపరిచిన పోలీసులు న్యూస్
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి పర్యటనలో కార్యకర్తను పోలీసులు గాయపరచలేదని అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణాటాటా చెప్పారు. తోపులాట మాత్రమే జరిగిందని తెలిపారు.
dgp about chittoor chandrababu visit