తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద పాము హల్చల్ చేసింది. నిత్యం జనసందోహంతో నిండి ఉండే ఆలయ ప్రాంగణంలోకి పాము రాగా.. భక్తులు పరుగులు పెట్టారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది.. ఆ సర్పాన్ని చెత్తకుండీతో మూసి పెట్టారు.
పాములు పట్టే సిబ్బంది అక్కడికి చేరుకుని.. భక్తులకు ఇబ్బంది కలుగకుండా సంచిలో తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. భక్తుల క్యూలైన్ సమీపం వరకు సర్పం రాగా.. కొంత సమయం పాటు సిబ్బంది ఆందోళన చెందారు.