తిరుమలలో కురిసిన జోరువర్షానికి భక్తులు ఇబ్బందిపడ్డారు. గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో... దర్శనానికి వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తడుస్తూనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వెళ్తున్నారు. దర్శానంతరం గదులకు వెళ్లే సమయంలోనూ తడుస్తున్నారు. అధికారులు క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. వర్షానికి ఆలయ మాడవీధులు జలమయమయ్యాయి.
తిరుమలలో భారీ వర్షం... ఆలయ మాడవీధులు జలమయం - rains in tirumala latest news
తిరుమలలో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది.జోరువానతో దర్శనానికి వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి ఆలయ మాడవీధులు జలమయమయ్యాయి.
తిరుమలలో భారీ వర్షం... ఆలయ మాడవీధులు జలమయం