లగేజీ తిరుమలకు చేరక.. కాలినడక భక్తుల ఆందోళన.. ఎట్టకేలకు..! - Tirumala Devotees Problems
18:30 June 02
లగేజీ తిరుమలకు చేరక.. కాలినడక భక్తుల ఆందోళన.. ఎట్టకేలకు..!
Tirumala Devotees Problems: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టుమార్గంలో కాలినడకన వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు సకాలంలో తిరుమలకు చేర్చకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు ఉదయం 8 గంటలకు తమ బ్యాగులను తితిదే లగేజీ కౌంటర్‌లో అందజేసి రసీదులు పొందారు. 10 గంటలకల్లా తిరుమలకు చేరుకొని ఎంబీసీ సమీపంలోని సామాన్లు తీసుకునే కౌంటర్ వద్దకు వచ్చారు. కొందరి బ్యాగులేవీ కొండపైకి రాకపోగా, మరికొందరివి మూణ్నాలుగు బ్యాగులకు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. సాయంత్రం వరకు వేచిచూసిన భక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. తితిదే అధికారులు, తిరుమల టూటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై రమేష్‌బాబు వచ్చి భక్తులకు సర్దిచెప్పారు. సాయంత్రం 7 గంటలకు మొత్తం బ్యాగులు తెప్పించి అప్పగించారు. ఈ కారణంగా దర్శనానికి వెళ్లలేని భక్తులకు ప్రత్యేకంగా చీటీలు రాసి ఇచ్చి తర్వాత పంపించారు. రైలు టిక్కెట్లు, స్వామివారి ముడుపులు, ముఖ్యమైన వస్తువులు బ్యాగుల్లో పెట్టుకున్న భక్తులు ఇబ్బంది పడ్డారు.
ఇదీ చూడండి..