తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు పొన్నాల సుధాకర్ తిరుమలకు పొర్లు దండాలతో పయనమయ్యాడు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి శ్రీవారిమెట్టు మార్గం ద్వారం సుమారు 19 కిలోమీటర్లు మేర పొర్లు దండాలు పెడుతూ.. గోవింద నామాలు జపిస్తూ తిరుమలకు చేరుకున్నాడు. గత ఏడాది కూడా వరలక్ష్మి వ్రతం రోజున ఇదే విధంగా మొక్కులు చెల్లించుకున్నాడు సుధాకర్.. 7 ఏళ్ల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో శ్రీవారిని మొక్కుకున్న సుధాకర్ ఆరోగ్యం కుదుటపడడంతో ఇలా వరుసగా మొక్కులు చెల్లించుకుంటున్నాడు.
శ్రీవారిమెట్టుపై పొర్లుదండాలతో తిరుమలకు భక్తుడు - తితిదే ప్రధాన వార్తలు
కలియుగ వైకుంఠ నాథునికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకుని తన్మయత్వం చెందాలనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా మొక్కులు చెల్లించుకుని శ్రీవారి కృపకు పాత్రులవుతుంటారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు రెండవసారి పొర్లు దండాలతో శ్రీవారిమెట్టు మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నాడు.
శ్రీవారిమెట్టుపై పొర్లుదండాలతో తిరుమలకు వెళ్లిన భక్తుడు
ఇదీ చదవండి: