తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారికి యజ్ఞోపవీతంతో.. పాటు దాదాపు 2లక్షల 89వేల రూపాయల విలువైన 31వేల వెండి బిళ్లలతో చేసిన తిరుప్పావై మాలను ఓ భక్తురాలు సమర్పించారు. తిరుపతికి చెందిన అబూ హతీమ్ గ్రూపు ఎమ్‌డీ సురేంద్ర రాజా కుమార్తె కౌస్తుభ ఈ ఆభరణాలను ఆలయ అధికారులకు అందజేశారు. ధనుర్మాసం సందర్భంగా 30 రోజులు పారాయణం చేసే 30 పాశురాలను వెండి బిళ్లలపై లిఖించారు. వెండితో తయారు చేసిన యజ్ఞోపవీతం విలువ దాదాపు రూ. 58 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
గోవిందరాజస్వామి వారికి వెండి ఆభరణాల బహూకరణ - తిరుపతి గోవిందరాజ స్వామికి వెండి ఆభరణాల బహూకరణ
తిరుపతి గోవిందరాజ స్వామి వారికి కస్తుభా అనే భక్తురాలు వెండి ఆభరణాలను బహూకరించారు. వెండితో చేసిన యజ్ఞోపవీతం, తిరుప్పావై మాలను ఆలయ అధికారులకు అందజేశారు. వాటి విలువ దాదాపు రూ. 3 లక్షల 15వేలు ఉంటుందని తెలిపారు.
గోవిందరాజస్వామి వారికి వెండి ఆభరణాల బహూకరణ