ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారికి రూ.2.45 కోట్ల హారం కానుకగా ఇచ్చిన భక్తురాలు - tirumala news

చెన్నైకి చెందిన భక్తురాలు తిరుమల శ్రీవారికి రూ.2.45కోట్లు విలువ చేసే హారాన్ని కానుకగా ఇచ్చారు. దీంతోపాటు తమకు చెందిన రూ.3.50 కోట్లు విలువైన స్థలాన్ని తితిదేకు అందించేందుకు సిద్ధపడ్డారు.

devotee donated rs 2.45 cr kasula haram to ttd
శ్రీవారికి రూ.2.45 కోట్ల హారం కానుకగా ఇచ్చిన భక్తురాలు

By

Published : Jun 10, 2022, 5:01 AM IST

చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. గురువారం సాయంత్రం ఆలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150 కిలోలు కాగా, వీటి విలువ సుమారు రూ.2.45 కోట్లు ఉంటుంది. దీంతో పాటు దాతలు చెన్నైలో తమకు చెందిన రూ.3.50 కోట్లు విలువైన స్థలాన్ని తితిదేకు అందించేందుకు సిద్ధపడ్డారు. అయితే స్థలాన్ని తితిదే రెవెన్యూశాఖ అధికారులు తనిఖీ చేసిన అనంతరం అధికారికంగా తీసుకుంటామని భక్తురాలికి తెలిపారు.

శ్రీవారికి రూ.2.45 కోట్ల హారం కానుకగా ఇచ్చిన భక్తురాలు
శ్రీవారికి రూ.2.45 కోట్ల హారం కానుకగా ఇచ్చిన భక్తురాలు
శ్రీవారికి రూ.2.45 కోట్ల హారం కానుకగా ఇచ్చిన భక్తురాలు
శ్రీవారికి రూ.2.45 కోట్ల హారం కానుకగా ఇచ్చిన భక్తురాలు

ABOUT THE AUTHOR

...view details