తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల విరాళం అందింది. కర్ణాటక రాష్ట్రం హుబ్లికి చెందిన దినేష్ నాయక్ అనే భక్తుడు... డీఆర్ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఒక కోటి 11 లక్షల 11వేల 111 రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీడీలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. విరాళం మొత్తంను ఎస్వీబీసీ ట్రస్టుకు కేటాయించాలని దినేశ్ నాయక్ కోరారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల విరాళం - ఎస్వీబీసీ ట్రస్టుకు భూరి విరాళం
కర్ణాటక రాష్ట్రం హుబ్లికి చెందిన దినేష్ నాయక్ అనే భక్తుడు.. ఎస్వీబీసీ ట్రస్టుకు భూరీ విరాళం ఇచ్చారు. కోటి రూపాయలకు సంబంధించిన డీడీలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల విరాళం
గత నెలలో అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు తెలిపిన తితిదే.. దాతను అదనపు ఈవో ధర్మారెడ్డి అభినందించారు.
ఇదీ చూడండి:అప్పన్న సన్నిధిలో జలధారలకు స్వరూపానందేంద్ర పుణ్యహారతి