ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం గారూ.. వైవీ సుబ్బారెడ్డి మాటలకు సమాధానం చెప్పండి' - latest news on ttd possession issue

తితిదే ఆస్తుల అమ్మకంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విటర్లో ఘాటుగా స్పందించారు. దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు.

devinenin uma o ttd lands selling
తితిదే భూముల అమ్మకాలపై దేవినేని ఉమా

By

Published : May 25, 2020, 12:35 PM IST

తితిదే ఆస్తుల అమ్మకంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటుగా స్పందించారు. దేవుడి ఆస్తులను అమ్ముకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. రాష్ట్రంలోని ప్రజల ఆస్తులను, దేవుడి ఆస్తులను మింగేస్తున్న వారు రక్షకులా?, భక్షకులా? అని ఆయన మండిపడ్డారు. గతంలో దేవాలయ భూముల అమ్మకాలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ.. ఎద్దేవా చేశారు. జగన్‌ బాబాయే స్వయంగా దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలకు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ అప్పటి ఒక ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details