ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా అభ్యర్థి గురుమూర్తికి కారు లేదు.. భాజపా అభ్యర్థి పేరిట రూ.19.50 కోట్ల - తిరుపతి న్యూస్ అప్​డేట్స్

తొమ్మిదిసార్లు తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌కు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి పేరిట కారు లేదు. భాజపా అభ్యర్థిని రత్నప్రభకు దాదాపు రూ.19.50 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి.

chintha mohan
chintha mohan

By

Published : Mar 30, 2021, 10:13 AM IST

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోమవారం నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం వారి ఆస్తుల వివరాలివీ..

గురుమూర్తి కుటుంబ ఆస్తులు రూ.47.25 లక్షలు

*వైకాపా అభ్యర్థి ఎం.గురుమూర్తి కుటుంబ ఆస్తులు మొత్తం రూ.47.25 లక్షలు.
*ఆయన పేరిట రూ.10,66,515 విలువైన చరాస్తులున్నాయి. భార్య నవ్యకిరణ్‌ పేరు మీద రూ.24,92,529 విలువైన చరాస్తులున్నాయి. ఇందులో గురుమూర్తి భార్య పేరిట రూ.7 లక్షల విలువైన కారు ఉంది.
*ఏర్పేడు మండలంలో మన్నసముద్రం గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి (డీకేటీ), 2,610 చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం వీటి విలువ రూ.5 లక్షలు.
*వీరికి అప్పులు లేవు. క్రిమినల్‌ కేసులూ లేవు.
*గురుమూర్తిపై ఆధారపడిన కార్తికేయ నిక్షాల్‌ దగ్గర రూ.2.92 లక్షల విలువైన 62 గ్రాముల బంగారం, డెలీనా నిక్షాల్‌ దగ్గర రూ.3.73 లక్షల విలువైన 83 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.

రత్నప్రభ కుటుంబ ఆస్తులు రూ.24.68 కోట్లు

భాజపా అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ కుటుంబ ఆస్తుల విలువ మొత్తం రూ.24,68,52,141. ఇందులో రత్నప్రభ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.19,57,75,095. రత్నప్రభ భర్త ఎ.విద్యాసాగర్‌ పేరున ఉన్న ఆస్తులు రూ.5,10,77,146.
*రత్నప్రభ చేతిలోని నగదు రూ.25,000
*వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు రూ.2.81 కోట్లు, బాండ్ల రూపంలో రూ.28 వేలు, తపాలా పొదుపుఖాతాలో రూ.4 లక్షలు
*రూ.52 లక్షల విలువైన 1,250 గ్రాముల బంగారం, రూ.1.95 లక్షల విలువైన 3 కేజీల వెండి
*రూ.16 లక్షల విలువైన రెండెకరాల వ్యవసాయ భూమి, రూ.3 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి
*ఎస్‌బీఐలో ఆమెపేరిట రూ.2.43 లక్షల రుణం ఉంది.
*ఎ.విద్యాసాగర్‌ పేరిట కోటి విలువైన చరాస్తులు, రూ.4.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆంధ్రాబ్యాంకులో రూ.17.30 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు. వీరిపై ఎలాంటి కేసులు లేవు.

చింతా మోహన్‌ కుటుంబ ఆస్తులు రూ.3.27 కోట్లు

  • కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ పేరున ఆస్తులేమీ లేవు. ఆయన వార్షికాదాయం రూ.6.10 లక్షలుగా అఫిడవిట్‌లో ప్రస్తావించారు.
  • ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.3.27 కోట్లు. ఇవన్నీ భార్య చింతా రేవతి పేరున ఉన్నాయి.
  • వీటిలో రూ.2 లక్షల నగదు, రూ.14,40,000 విలువైన 400 గ్రాముల బంగారం ఉంది.
  • తిరుపతిలో 20 సెంట్ల వ్యవసాయేతర భూమి ఉంది. దీని విలువ రూ.1.20 కోట్లుగా పేర్కొన్నారు.
  • తిరుపతి రామచంద్రనగర్‌లో రూ.95 లక్షల విలువైన వాణిజ్య భవనం ఉంది.
  • ఎస్‌బీఐలో రూ.19.11 లక్షల అప్పు ఉంది. వీరిపై ఎలాంటి కేసులు లేవు.

ఇదీ చదవండి: జాతీయ పతాకం రూపకల్పన తెలుగు జాతికి గర్వకారణం..

ABOUT THE AUTHOR

...view details