ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పవన్​ కల్యాణ్​కు.. ఉప ముఖ్యమంత్రి సవాల్ - ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

Narayana Swamy On Pawan Comments: ఎవరు.. ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైకాపాను ఓడించలేరని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మతాన్ని, కులాన్ని చూపించి జనసేన నేత పవన్​ ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు.

Narayana Swamy On Pawan Comments
Narayana Swamy On Pawan Comments

By

Published : Jun 5, 2022, 5:19 PM IST

Deputy Cm Narayana Swamy: 'ఎవరు.. ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన వైకాపాను ఓడించలేరు' అని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి బాలాజీ డైరీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... మతాన్ని, కులాన్ని చూపించి జనసేన నేత పవన్​ ఓట్లు అడుగుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు. 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేక.. పొత్తుల కోసం పవన్‌ కల్యాణ్ పాకులాడుతున్నారని విమర్శించారు. 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్​ చేశారు. తెదేపా ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details