ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అణగారిన వర్గాల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి' - ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వార్తలు

అణగారిన వర్గాల రాజకీయ, సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి శంకర్​ నారాయణ అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు.. 50.4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్​కే దక్కుతుందన్నారు.

deputy cm narayana swamy and minister shankar narayana speaks over nominated posts
అణగారిన వర్గాల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి

By

Published : Jul 18, 2021, 8:29 PM IST

నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు న్యాయం చేశారని.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు, ప్రజా సేవ చేయగలిగే వారికే సీఎం అవకాశం కల్పించారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు.. 50.4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. 30 లక్షల మంది నిరుపేదల సొంతింటి కల నిజమవుతోందని.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రతిపక్షనేతకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు?

రాజన్న రాజ్యం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కళలు కనిపిస్తున్నాయి

రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల నియామకాల్లో.. రాజన్న రాజ్యం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కళలు కనిపిస్తున్నాయని మంత్రి శంకర్​ నారాయణ కొనియాడారు. అణగారిన వర్గాల రాజకీయ, సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. అణగారిన వర్గాలను ఓటు బ్యాంకుగా చూసిన వ్యక్తి మాజీ సీఎం చంద్రబాబు అని విమర్శించారు.

బడుగు బలహీన వర్గాలు సీఎంకు అండగా ఉన్నారనే భయంతోనే.. తెదేపా నాయకులు జగన్​పై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సీఎం జగన్​ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారని తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తూ.. 50 శాతం నామినేటెడ్ పదవులు కేటాయించారన్నారు .

ఇదీ చదవండి:

arrest: 'చలో తాడేపల్లి'కి పిలుపు... నాయకుల ముందస్తు అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details