ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గంటన్నరలో... లక్షా 10 వేల తితిదే దర్శనం టిక్కెట్లు అమ్మకం - చిత్తూరు తాజా సమాచారం

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. రథసప్తమి, ఫిబ్రవరికి సంబంధించిన.. లక్షా 10 వేల టిక్కెట్లను తితిదే విడుదల చేయగా గంటన్నర సమయంలోనే అమ్ముడుపోయాయి.

demand-for-tirumala-srivari-darshnam-tickets
గంటన్నరలో అమ్ముడైన... లక్షా 10 వేల తితిదే దర్శనం టిక్కెట్లు...

By

Published : Feb 11, 2021, 8:18 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లను తితిదే విడుదల చేసింది. వీటి కొనుగోలు కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. రథసప్తమితో పాటు, ఫిబ్రవరికి సంబంధించిన మొత్తం లక్షా 10 వేల టిక్కెట్లను విడుదల చేయగా.. గంటన్నరలోనే అమ్ముడుపోయాయి. టిక్కెట్లు పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో.. తితిదే వెబ్‌సైట్​ను ఆశ్రయించారు.

కరోనా ప్రభావంతో గతేడాది మార్చి నుంచి నాలుగు నెలల పాటు.. తిరుమలో శ్రీవారి దర్శనాన్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో.. పరిమిత సంఖ్యలో భక్తులను.. అధికారులు అనుమతిస్తున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details