ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chittoor Road Accident Updates: రుయాలో శవపరీక్షలు.. స్వగ్రామాలకు మృతదేహాల తరలింపు - 7 dead in chittoor road accident

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఏడుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించారు పోలీసులు. శవ పరీక్షల అనంతరం... స్వగ్రామాలకు తరలించారు. గాయాలతో బయటపడిన రెండేళ్ల చిన్నారికి రుయాలోనే చికిత్స అందిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు వెల్లడించారు.

chittoor road accident
chittoor road accident

By

Published : Dec 6, 2021, 7:11 PM IST

Chittoor Road Accident Updates: చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి దేహాలను పోలీసులు బంధువులకు అప్పగించారు. తిరుపతి రుయా మార్చురీలో ఏడు మృతదేహాలకు శవపరీక్షలు చేపట్టారు. అనంతరం వారి బంధువులకు అప్పగించారు. రెండు అంబులెల్స్​ల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. గాయాలతో బయటపడిన రెండేళ్ల చిన్నారికి రుయాలోనే చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు 48 గంటల తర్వాత చికిత్స కోసం విశాఖకు తరలిస్తామని సీఐ శ్రీనివాసులు చెప్పారు.

ఏం జరిగిందంటే..
7 killed in Chittoor Road Accident: నిన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. 5 నెలల చిన్నారి మొక్కు తీర్చేందుకు షిఫ్ట్​ కారులో తిరుపతికి బయల్దేరింది. శ్రీవారి దర్శనం ఉండటంతో కాణిపాకంలోని సిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ్నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఉన్న పుతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు.

ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని తిరుపతి రుయాకు తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో గోవిందరాజు(61), సురేశ్(36), శ్రీరామమూర్తి, పైడి హైమావతి (51), మీనా(30), జిషిత (6 నెలలు) ఉన్నారు. వీరిలో ఐదుగురు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తికి చెందిన వారిగా గుర్తించారు. కాగా గోవిందరాజు(61) విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం వాసిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కారు నెంబరును AP39 HA 4003 గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

Road accident in chittoor district: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details