ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాలా తీర్చిదిద్దేలా సీఎం జగన్ తపన పడుతున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామదర్శనంలో ఆయన కుటుంబసమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు డిప్యూటీ సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. దళితుల, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని నారాయణస్వామి అన్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో వైకాపాను గెలిపించేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారంటూ ధీమా వ్యక్తం చేశారు.
'తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపాను గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు' - తిరుమలలో ఉపముఖ్యమంత్రి పర్యటన
తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికల్లో వైకాపాను గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ప్రతి జిల్లాను అభివృద్ధి చేసేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.
Dcm_Narayana