ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీనివాస మంగాపురంలో.. శ్రీవారికి వైభవంగా చక్రస్నానం - ముగుస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం రాత్రి 7 నుంచి 8 గంటలకు ద్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Cycling in honor of Thirumala Srivastava
శ్రీవారికి వైభవంగా చక్రస్నానం.. ముగుస్తున్న బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 10, 2021, 12:59 PM IST

Updated : Mar 10, 2021, 3:05 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజున చ‌క్ర‌స్నాన ఘ‌ట్టం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ బాలాజి రంగాచార్యుల ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వస్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను తితిదే వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. రాత్రి 7 నుంచి 8 గంట‌ల‌ వరకు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

Last Updated : Mar 10, 2021, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details