ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CS: తిరుపతికి సీఎస్..తిరుచానూరు, కాణిపాకంలో ప్రత్యేక పూజలు - తిరుపతి చేరుకున్న సీఎస్ న్యూస్

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ (CS Adityanath das) రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్నారు. తిరుచానూరు, కాణిపాకం ఆలయాలను సందర్శించిన సీఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CS adityanath das reached Tirupati
CS adityanath das reached Tirupati

By

Published : Jun 26, 2021, 9:07 PM IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్​కు (CS adityanath das) చిత్తూరు జిల్లా అధికారులు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుచానూరు, కాణిపాకం ఆలయాలను సీఎస్ కుటుంబ సభ్యులు సందర్శించారు. మొదటగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనతరం కాణిపాకం చేరుకున్న ఆయనకు అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు సీఎస్​కు తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం తర్వాత కాణిపాకం నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details