ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI RamaKrishna on BJP-Janasena : త్వరలో భాజపా-జనసేన తెగదెంపులు ఖాయం -సీపీఐ రామకృష్ణ - CPI RamaKrishna on BJP-Janasena

CPI RamaKrishna on BJP-Janasena : త్వరలో భాజపా-జనసేన తెగదెంపులు ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భాజపా ఇచ్చిన రోడ్‌మ్యాప్‌లో ఇప్పటికే జగన్‌ వెళ్తున్నారని, ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు రోడ్‌ మ్యాప్‌ ఎందుకిస్తారని రామకృష్ణ సందేహం వ్యక్తం చేశారు.

CPI RamaKrishna
CPI RamaKrishna

By

Published : Mar 18, 2022, 7:22 PM IST

CPI RamaKrishna on BJP-Janasena : త్వరలో భాజపా - జనసేన తెగదెంపులు ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తొందరలోనే వాస్తవాలు తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు.

త్వరలో భాజపా-జనసేన తెగదెంపులు ఖాయం -సీపీఐ రామకృష్ణ

జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వెంటనే వారి కుటుంబాలను జగన్ పరామర్శించాలన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక సొంత బ్రాండ్లు అమ్ముకుంటున్నారని.. ఇప్పటి వరకు 10 వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు.

ఇదీ చదవండి :Nakka Anandbabu : ప్రభుత్వం రైతులను మోసం చేసింది - నక్కా ఆనంద బాబు

ABOUT THE AUTHOR

...view details