విశాఖ శారదా పీఠంలో తానేమీ స్వామికి తలొగ్గలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. స్వరూపానందేంద్ర స్వామికి భక్తుడిని కాదని స్పష్టం చేశారు. శాలువా కప్పేందుకు వస్తే.. కాస్త తగ్గాను తప్ప మరేమీ కాదని వెల్లడించారు. ఎన్నికల్లో ఓట్లు అడగడంపై దుష్ప్రచారం చేయటాన్ని నారాయణ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆయన..ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలన్నారు.
శారదా పీఠంలో నేనేమీ స్వామికి తలొగ్గలేదు: నారాయణ - cpi narayana react on visit the sharada peetam
విశాఖ శారదా పీఠానికి వెళ్లిన తనపై విమర్శలు చేయటాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. తానేమీ స్వామికి తలొగ్గలేదని పేర్కొన్నారు. స్వరూపానందేంద్ర స్వామికి భక్తుడిని కాదని స్పష్టం చేశారు.
సీపీఐ నారాయణ