ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది: సీపీఐ నారాయణ

By

Published : Nov 7, 2020, 8:32 PM IST

అమరావతి, పోలవరం అభివృద్దిని ముఖ్యంత్రి జగన్ గాలికి వదిలేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దళిత వ్యతిరేకిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని.., గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయని పక్షంలో ఈ నెల 16 నుంచి ఉద్యమం చేపడతామని నారాయణ హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోంది

అభివృద్ది విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మూడు నామాలు పెట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో సమావేశం నిర్వహించిన ఆయన...అమరావతి, పోలవరం అభివృద్దిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి జగన్​కి తలొగ్గి దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దళిత వ్యతిరేకిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు నాటు సారా బ్రోకర్లు ఉన్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని..,లేనిపక్షంలో ఈ నెల 16 నుంచి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details