ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భాజపాతో వైరం అయినా ఒకే వేదికపై'...'తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లే'

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అంతా అడుగుతుంటే.. తలెక్కడ పెట్టుకోవాలో అర్ధం కావట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. స్వాతంత్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మినహా అందరూ అమరావతే రాజధానిగా కోరుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు.

cpi-narayana-and-ramakrishna-comments
cpi-narayana-and-ramakrishna-comments

By

Published : Dec 17, 2021, 7:49 PM IST

అమరావతి పసికందును జగన్ రెడ్డి 3ముక్కలు చేసిన రాక్షసుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. అగ్నిగుండాన్ని తలపించేలా రైతుల పాదయాత్ర సాగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అంతా అడుగుతుంటే తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదని నారాయణ అన్నారు. స్వాతంత్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమేనని అన్నారు.

జగన్ మినహా అందరూ అమరావతే రాజధాని గా కోరుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. తమకు, భాజపాకు పడకపోయినా ఒకే వేదికను పంచుకున్నామంటే అందుకు కారణం.. అందరి ఆకాంక్ష అమరావతేనని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే పోరాటం అమరావతి ఉద్యమని సీపీఐ రామకృష్ణ ఉద్ఘాటించారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే అమరావతి రాజధానిగా ఉండాలని కోరారు. మోదీ కానీ, అమిత్​ షా కానీ చెప్తే కాదనే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. భాజపా అగ్ర నేతలు ఖచ్చితంగా జగన్​కు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. రహస్య బ్యాలెట్​ పెడితే అత్యధిక వైకాపా నాయకులు సైతం అమరావతినే రాజధాని గా కోరుకుంటారని అన్నారు.


ఇదీ చదవండి:CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details