ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI NARAYANA : 'మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోండి' - cpi meeting

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చెప్పులపై జీఎస్టీ పెంచడం ఏమిటని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని భాజపా నేతలకు హితవు పలికారు. రాష్ట్రంలో రౌడీలు, పోలీసులు కలిసిపోయారని ఆక్షేపించారు.

సీపీఐ నారాయణ
సీపీఐ నారాయణ

By

Published : Dec 31, 2021, 10:21 PM IST

రాష్ట్రంలో రౌడీలు, పోలీసులు కలిసిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం చెప్పులపై జీఎస్టీ పెంచడాన్ని తప్పుపట్టారు. చెప్పులను నెత్తిపై పెట్టుకొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో చెప్పులు కాళ్లకు తొడుక్కొనేలా లేవని, నెత్తిపై పెట్టుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

చీప్‌ లిక్కర్‌పై నేలబారు ప్రకటనలు చేసి విజయవాడలో పరువు పోగొట్టుకొన్న సోము వీర్రాజు.. గుంటూరులో జిన్నా టవర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని మానుకోవాలని హితవు పలికారు.

రైతులకు అండగా నిలబడిన సోనూసూద్​పై కేసులు పెట్టిన కేంద్రప్రభుత్వం అశ్లీలంగా నటించే కంగనా రనౌత్ కు పద్మశ్రీ పురస్కారం ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పే-రివిజన్‌ కమిషన్‌ కాస్తా.. పే-రివర్స్ కమిషన్ గా మారిందని నారాయణ ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి :

ABOUT THE AUTHOR

...view details