తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కరోనా టీకా వేయించుకున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మొదటి దశలో భక్తులకు నేరుగా సేవలందించే వారికి వ్యాక్సిన్ వేస్తుండగా... ఇప్పటివరకు వేయి మంది ఉద్యోగులకు కరోనా టీకా వేసినట్లు తితిదే ప్రకటించింది. మూడు విడతల్లో ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ కొవిడ్ టీకా వేయించుకుని సురక్షితంగా ఉండాలని ధర్మారెడ్డి కోరారు.
కొవిడ్ టీకా తీసుకున్న తితిదే అదనపు ఈవో
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రధాన ఆర్చకులు వేణుగోపాల దీక్షితులు కొవిడ్ టీకా వేయించుకున్నారు. మూడు దశల్లో ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
కొవిడ్ టీకా తీసుకున్న తితిదే అదనపు ఈవో