ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబులెన్స్​లోనే కొవిడ్​ రోగి మృతి.. బంధువుల ఆందోళన - tirupati ruya hospital latest news

తిరుపతి రుయా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన కొవిడ్ రోగి అంబులెన్స్​లో మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు ఆందోళన చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అంబులెన్స్​లోనే కొవిడ్​ రోగి మృతి.. బంధువుల ఆందోళన
అంబులెన్స్​లోనే కొవిడ్​ రోగి మృతి.. బంధువుల ఆందోళన

By

Published : May 8, 2021, 9:25 PM IST

తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చిన కొవిడ్ రోగి అంబులెన్స్​లోనే మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గురవరాజపల్లెకి చెందిన విశ్రాంత కానిస్టేబుల్​కి కరోనా సోకింది. చికిత్స కోసం అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకువచ్చారు. హాస్పిటల్​లో పడకలు ఖాళీ లేకపోవటంతో అంబులెన్స్​లోనే ప్రాథమిక చికిత్స చేశారు. వైద్యం అందిస్తుండగానే అతను మరణించాడు. దీంతో రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబులెన్స్​లో ఆసుపత్రికి వచ్చి మూడు గంటలు గడిచినా... పడకలు లేవని చెప్పారని మండిపడ్డారు. రోగిని ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూ పడకలు ఖాళీ లేవని.. వచ్చిన రోగులను వెనక్కి పంపించకూడదనే ఉద్దేశంతో ట్రాయేజ్ కేంద్రంలో బెడ్లు ఏర్పాటు చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అవి కూడా నిండిపోవటంతో వాహనంలోనే ఉంచి ప్రాథమిక చికిత్స అందించినట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి:భార్యకు కరోనా... మనస్థాపంతో భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details